హైదరాబాదీలు ఎక్కడున్నా వెంటనే ఇంటికి వెళ్లిపోండి.వచ్చే గంటలో వర్ష బీభత్సం.☔🏡
- Suresh D
- Jul 24, 2023
- 1 min read
వాతావరణ శాఖ హైదరాబాదీలను అలర్ట్ చేసింది. రానున్న గంటలో నగరంలో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే పలుచోట్ట వర్షం ప్రారంభమైంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ముఖ్యంగా అమీర్‌పేట్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, కోఠి, పంజాగుట్ట, ఎర్రగడ్డలో వర్షం మొదలైంది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు సైతం అలర్ట్ అయ్యారు. వర్షం నీరు భారీగా చేరే ప్రాంతాల్లో చర్యలు ప్రారంభించారు. సుమారు గంటపాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.











































