top of page

🔈 అసెంబ్లీ ప్యానెల్ స్పీకర్లుగా నలుగురు సీనియర్ సభ్యులు 🔈

📜 శాసనసభకు సాధారణంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. అయితే వీరిద్దరూ సభలో లేనప్పుడు సభను నడిపించేందుకు నియమించే తాత్కాలికంగా స్పీకర్లనే ప్యానెల్ స్పీకర్లు అంటారు. శాసనసభకు వారిని ఏ అర్హత ఆధారంగా నియమిస్తారు? అనేది చూద్దాం. 📚

🔍 ప్యానెల్ స్పీకర్ల గురించి రాజ్యాంగంలో ఎక్కడా పొందుప‌ర‌చ‌లేదు. అయితే అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు సభలో లేనప్పుడు సభకు అధ్యక్షత వహిస్తారు. సమావేశాలు ప్రారంభమైన తొలి రోజునే ప్యానెల్ స్పీకర్లను అసెంబ్లీ స్పీకర్ నియామిస్తారు. 📅

👥 సీనియర్ సభ్యులను శాసన సభకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్లుగా ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఆ మాదిరిగానే ప్యానెల్ స్పీకర్ల నియామకం ఉంటుంది. సీనియర్ సభ్యులైన ఒకరు నుంచి నలుగురిని ప్యానెల్ స్పీకర్లుగా నియామకం చేయడం స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభలో లేనప్పుడు సభకు ప్యానెల్ స్పీకర్లు శాసన సభకు అధ్యక్షత వహిస్తారు. తెలంగాణలో అసెంబ్లీలో ప్యానెల్ స్పీకర్లుగా సీనియర్ సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, బాలూ నాయక్, కౌసర్ మొహియుద్దీన్, కూనంనేనీ సాంబశివరావులను నియామించారు. 👥

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page