top of page

🇨🇳 చైనా, మయన్మార్‌లను వణికిస్తున్న వరదలు..🇲🇲

🇨🇳 మీడియా తమ దేశ తాజా పరిస్థితిని వివరిస్తూ.. శుక్రవారం నాటికి, 39 లక్షల మంది లేదా ప్రావిన్స్ జనాభాలో ఐదు శాతం మంది వరదల చిక్కుకున్నారని తెలిపింది. నివేదిక ప్రకారం ఇక్కడ 40 వేల ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంతేకాదు కాదు లక్షా 55 వేల ఇళ్లకు విద్యుత్, నీటి సమస్య తలెత్తింది. 1.75 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. చలికాలం లోపు దెబ్బతిన్న ఇళ్లన్నింటిని బాగు చేయాలని చైనా ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం మరో 202 మిలియన్ యువాన్లను విపత్తు సహాయ నిధిగా కేటాయించింది.

🇲🇲మయన్మార్‌లో కూడా వరదల కారణంగా పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ వేలాది మంది నిరాశ్రయులయ్యారు. గత వారం రోజులుగా ఇక్కడ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా మయన్మార్‌లోని ఐదు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ ఐదుగురు చనిపోయారు. 40 వేల మందికి పైగా ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాల్సి వచ్చింది. లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. నగరంలో పలు సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. బాధిత ప్రాంతాల్లో రెస్క్యూ టీం సహాయక చర్యలు కొనసాగిస్తోంది.

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page