లఢఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు.. ఎక్స్‌లో ప్రధాని మోదీ పోస్ట్
- MediaFx

- Aug 26, 2024
- 1 min read
కేంద్రపాలిత ప్రాంతమైన (Union Territory) లఢఖ్ (Ladakh) లో ఐదు కొత్త జిల్లాలు (Five new districts) ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) తెలిపారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. జన్‌స్కార్ (Zanskar), డ్రాస్ (Drass), షామ్ (Sham), నుబ్రా (Nubra), చాంగ్‌తాంగ్ (Changthang) జిల్లాలను కొత్త ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. లఢఖ్‌లో సుపరిపాలన అందించడం కోసం, అక్కడ ప్రజల శ్రేయస్సు కోసం తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రధాని పేర్కొన్నారు. అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయాన్ని వెల్లడించారు. లఢఖ్‌లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు అమిత్ షా కూడా తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. లఢఖ్ ప్రజలకు అద్భుతమైన అవకాశాలను సృష్టించడం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.












































