top of page

ఈసారి పవన్ షూటింగ్‌కు రావడం పక్కా.. మాకు నమ్మకం లేదు దొర అంటున్న ఫ్యాన్స్


ree

ఈసారి పక్కా.. రాసి పెట్టుకోండి పవన్ కళ్యాణ్ షూటింగ్‌కు వస్తున్నారు. ముందు హరిహర వీరమల్లు.. ఆ తర్వాత ఓజి పూర్తి చేస్తారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలివి. మాకు నమ్మకం లేదు దొర.. ఇదిగో ఇదే పవన్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న రియాక్షన్. మరి ఇందులో ఏది నిజం కానుంది..? పవన్ రాకా లేదంటే అభిమానుల నమ్మకమా..?

ree

రారా బంగారం అన్నా.. ఇదిగో ఇలా స్వాగతం కృష్ణా అని పిలిచినా.. ఆరడుగుల బుల్లెట్ అంటున్నా.. ఏమని పిలిచినా పవన్ మాత్రం షూటింగ్స్‌కు రావట్లేదు. ఆంధ్రాలో అనుకోని వరదలతో ఈయన షెడ్యూల్స్ అన్నీ బిజీగా మారిపోయాయి.

ree

ఈ సమయంలో పవన్ సినిమాల షూటింగ్ ఇంకెప్పుడనే ప్రశ్న అభిమానులను వెంటాడుతుంది. దీనికిప్పుడు సమాధానం దొరికినట్లే అనిపిస్తుంది. షూటింగ్స్ విషయంలోనూ ఆ మధ్య పవన్ ‌కళ్యాణ్‌ను కలిసొచ్చారు దర్శక నిర్మాతలు.

ree

డేట్స్ ఇస్తానని వాళ్లకు ఆయన హామీ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 22 నుంచి హరిహర వీరమల్లుకు ముహూర్తం కుదిరినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి ఓజి షూటింగ్ కూడా జరగనుందని ప్రచారం జరుగుతుంది.

ree

డేట్స్ ఇస్తాను కానీ.. కండీషన్స్ అప్లై అంటున్నారు పవన్ కళ్యాణ్. ఆయనున్న బిజీలో లొకేషన్స్ తిరగడం అయ్యేపని కాదు.. అందుకే ఏ షూటింగ్ అయినా మంగళగిరి నుంచే జరగాలని ఆయన కోరినట్లు తెలుస్తుంది. దర్శక నిర్మాతలు కూడా దీనికి ఓకే చెప్పారు. వీరమల్లు, ఓజి తర్వాతే.. డిసెంబర్ నుంచి ఉస్తాద్ మొదలయ్యే అవకాశాలున్నాయి. మరి చూడాలిక.. ఈ సారైనా పవన్ వస్తారా రారా అనేది..!

bottom of page