పబ్లిక్‌లో విజయ్ దేవరకొండ బూతులు🎥
- Suresh D
- Apr 4, 2024
- 1 min read
తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ను బైక్‌పై ఎక్కించుకొని స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు విజయ్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ బైక్ రైడింగ్ కొద్ది క్షణాల ముందు విజయ్ అన్న ఒక మాటపై కొంతమంది నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మృణాల్‌ను బైక్‌పై ఎక్కించుకున్న తర్వాత ఎదురుగా ఫుల్ రెష్‌గా ఉండటంతో "అరే జరగండ్రా నీ **" అంటూ విజయ్ గట్టిగా అరిచాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కొంతమంది విజయ్‌ను టార్గెట్ చేస్తున్నారు. పబ్లిక్‌లో అవేం మాటలు బ్రో అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే దీనిపై రౌడీ ఫ్యాన్స్ కూడా అదే రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు. విజయ్ భాషే అంత, అక్కడ ఎవరినీ కావాలని అనలేదు కదా అంటూ రిప్లయ్ ఇస్తున్నారు.🎥











































