top of page

పుష్ప విలన్.. ఫహాద్ ఫాజిల్ పై కేసు.. కారణం ఇదే..

తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిన మలయాళీ హీరో ఫహాద్ ఫాజిల్ ఇప్పుడు కేరళ మానవ హక్కుల సంఘం నుండి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. "పుష్ప" సినిమాలో విలన్ పాత్రలో మంచి పేరు తెచ్చుకున్న ఫహాద్ ఇప్పుడు "పుష్ప 2" లో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

అవకాశాలు పొందుతూ హిట్స్ అందుకుంటున్న ఫహాద్ ప్రస్తుతం "పింకీలీ" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఎర్నాకులం ప్రభుత్వ ఆసుపత్రిలో జరుపగా రోగులకు తీవ్ర ఇబ్బందులు కలిగించిందని ఆరోపణలు వచ్చాయి. ఎమర్జెన్సీ రూంలో కూడా షూటింగ్ జరిపినట్లు తెలుస్తోంది. జిల్లా వైద్యాధికారి బీనా కుమారి దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసి, షూటింగ్ అనుమతి ఎలా ఇచ్చారనే విషయంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

అసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి కుటుంబసభ్యులు షూటింగ్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలను నిర్మాతల సంఘం ఖండించింది, కానీ కేరళ మానవ హక్కుల సంఘం ఈ విషయంపై ఫహాద్ ఫాజిల్ పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page