‘టైగర్ నాగేశ్వరరావు’ తొలి పాట విడుదల చేసిన చిత్ర బృందం..
- Suresh D
- Sep 6, 2023
- 1 min read
వాల్తేరు వీరయ్య, రావణాసుర తర్వాత ఈ ఏడాది ఆయన నుంచి వస్తున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ప్యాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో నుపూర్ సనన్ టాలీవుడ్ కు హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రవితేజ ఇందులో స్టూవర్టుపురం దొంగ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ పాట విడుదలైంది.











































