top of page

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ లో తెలుగు విన్నర్స్


14 వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో తెలుగు సినిమా మరింత గుర్తింపు తెచ్చుకుంది. పలు కేటగిరిలలో అవార్డులను గెలుపొందింది. మా ఊరి పొలిమేర 2 చిత్రం లో తన నటనకు గానూ, ఉత్తమ నటి జ్యూరీ అవార్డు ను గెలుచుకున్నారు కామాక్షి భాస్కర్ల. ఈ అవార్డు గెలుపొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.మంత్ ఆఫ్ మధు చిత్రం లో తన అద్భుతమైన నటనకి గానూ, నవీన్ చంద్ర ఉత్తమ నటుడు అవార్డు ను గెలుచుకున్నారు. స్పెషల్ జ్యూరీ కేటగిరిలో ఉస్తాద్ చిత్రం అవార్డు ను గెలుచుకోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి ఉత్తమ బాలనటి అవార్డు ను గెలుపొందింది. గాంధీ తాత చెట్టు లో తన నటనకు ఈ అవార్డు లభించింది.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page