top of page

🏏రికార్డ్‌ సృష్టించిన శుభమాన్ గిల్...🏆🇮🇳

🏆 ఆసియా కప్‌ 2023 టోర్నీలో భాగంగా భారత్, నేపాల్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ree

ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ 230 పరుగులు చేసినప్పటికీ.. మధ్యలో వర్షం అంతరాయం కలిగించడంతో భారత్‌కి 23 ఓవర్లకు 144 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. టార్గెట్‌ని చేధించేందుకు రంగంలోకి రోహిత్ శర్మ 77, శుభమాన్ గిల్(67) హాఫ్ సెంచరీలో చెలరేగడంతో టీమిండియా విజయం సాధించింది. అలాగే సూపర్ 4కు క్వాలిఫై అయింది. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్‌లో 67 పరుగులు చేసిన శుభమాన్ ఓ అద్భుతమైన రికార్డును సృష్టించాడు. భారత్ తరఫున అత్యంత వేగంగా 1500 వన్డే పరుగులు చేసుకున్న ఆటగాడిగా శుభమాన్ అవతరించాడు. శుభమాన్ ఇప్పటి వరకు 4 సెంచరీలు, ఓ డబుల్ సెంచరీతో మొత్తం 1514 పరుగులు చేశాడు. 🏏🇮🇳👏


 
 
bottom of page