🏏🚩ఏపీ నుంచి ఐపీఎల్‌కు టీమ్‌ను పంపడమే లక్ష్యం 😎🤩
- Shiva YT
- Aug 1, 2023
- 1 min read
ఇండియన్ ప్రీమియర్ లీగ్ – ఐపీఎల్‌లో ఆంధ్రా జట్టు లేదు. వచ్చే సీజన్‌కు ఆంధ్రా నుంచి కూడా ఐపిఎల్‌కుఒక టీమ్‌ను పంపే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ బదులు ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించడం ద్వారా యువ ప్రతిభను గుర్తించడం, ఉన్న ఆటగాళ్లలో నైపుణ్యాన్ని పెంపొందించడంతోపాటు క్రీడాకారులకు నైపుణ్యాన్ని పెంపొందించడమే ధ్యేయంగా ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. సీజన్ 2 పై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ గత సీజన్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందనీ,. మరిన్ని జట్లను చేర్చుకోవడానికి మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, మ్యాచ్‌లు గ్రిప్‌గా ఉండేలా చూసేందుకు, కొత్త పాలక మండలి మరో జట్టును మాత్రమే చేర్చుకోవాలని నిర్ణయించిందని తెలిపారు. 🏆🏏👏












































