top of page

ఆసియా కప్ గెలవాలంటే వీళ్లు ఉండాల్సిందే..

🥇🏆🏏టీమ్ ఇండియాకు 4వ నంబర్ ప్లేయర్ అవసరం.. నంబర్ 4 స్థానం భారత క్రికెట్‌లో అతిపెద్దగా ప్రశ్నగా మారింది. 2019 నుంచి 2023 వరకు ప్రపంచ కప్ వరకు ఇదే సమస్యతో కొట్టుమిట్టాడింది.

ree

గత ఏడాదిన్నర కాలంలో భారత్ ఈ స్థానంలో 9 మంది బ్యాట్స్‌మెన్‌లను ప్రయత్నించింది. చివరికి, సమాధానం శ్రేయాస్ అయ్యర్ రూపంలో దొరికింది. కానీ, అతను ఎంత ఫిట్ గా ఉన్నాడో చెప్పడం కష్టం. 🙌🏏ఆయన స్థానంలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్ వంటి పోటీదారులలో భారత సెలెక్టర్లు ఉత్తమ ఎంపికను ఎంచుకోవడం అవసరం. హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయం.. హార్దిక్ పాండ్యా ఉండటం టీమ్ ఇండియాకు శుభవార్త.🏆🏏 గాయం నుంచి కోలుకున్న తర్వాత, పాండ్యా IPL 2023, వెస్టిండీస్ పర్యటనలో ODI, T20 సిరీస్ మ్యాచ్‌లు ఆడాడు. అతను మరింత ఫిట్‌గా ఉండి, టీమ్ ఇండియా ప్రదర్శనలోనూ దూకుడు చూపించాల్సి ఉంటుంది. కానీ ప్రశ్న ఏమిటంటే, అతను కాకపోతే ఎవరు? ఈ ప్రశ్నకు భారత సెలక్టర్లు కూడా సమాధానం వెతకాలి.🤝🇮🇳


 
 
bottom of page