top of page

ఈ ఇద్దరి ఆటగాళ్ల ముందు దిగ్గజాలైనా తలవంచాల్సిందే.!

రెండో ఇన్నింగ్స్‌లో 159 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు.. పాక్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది ఆరంభంలో గట్టి షాక్ ఇచ్చాడు.

ree

ఫలితంగా 20 పరుగులకే మొదటి 3 వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్. అయితేనేం ఆ తర్వాత వచ్చిన మిచెల్(72), ఫిలిప్స్(70) నాలుగో వికెట్‌కు 130 పరుగులకుపైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పడమే కాకుండా.. అదిరిపోయే అర్ధసెంచరీలతో గ్రౌండ్ దద్దరిల్లేలా చేశారు. 44 బంతులు ఎదుర్కున్న మిచెల్.. 7 ఫోర్లు 2 సిక్సర్లతో 72 పరుగులు.. 52 బంతులు ఎదుర్కున్న ఫిలిప్స్ 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు చేశారు. కాగా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మిచెల్‌ను వరించింది. ఇక రెండు జట్ల మధ్య చివరి టీ20 ఆదివారం హగ్లేయ్ ఓవల్ స్టేడియంలో జరుగుతుంది.

మరోవైపు గతంలోనూ ఫిలిప్స్, మిచెల్.. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌ల్లో మెరుపులు మెరిపించారు. మలుపుతిప్పే ఇన్నింగ్స్‌లతో టీమిండియా చేతుల్లో నుంచి విజయాన్ని దాదాపుగా లాగేసేలా చూశారు. 😊 తమ దూకుడైన ఆటతీరుతో టీమిండియా బౌలర్లను వణికించారు. 👏


 
 
bottom of page