top of page

మతిపోగుడుతున్న జియో వార్షికోత్సవ ఆఫర్లు..

భారతదేశంలోని టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలకు నెట్‌ వచ్చిందంటే కారణం జియో అనే అందరికీ తెలిసిన విషయమే. జియో దెబ్బకు ఇతర టెలికాం కంపెనీలు కూడా తక్కువ ధరకు వినియోగదారులకు నెట్‌ అందిస్తున్నాయి. పెరిగిన పోటీ కారణంగా జియో కూడా వివిధ ఆఫర్లను ప్రకటిస్తుంది. తాజాగా జియో ఏడో వార్షికోత్సవం పలు ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు సెప్టెంబర్ 5 నుంచి 30 మధ్య చేసిన రీఛార్జ్‌లపై వర్తిస్తాయి. ఈ కాలంలో చేసిన రీచార్జ్‌లపై అదనపు డేటాతో పాటు వోచర్‌లను అందిస్తోంది. జియో ప్రకటించిన ఈ నయా ప్లాన్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ree

జియో ఏడో వార్షికోత్సవం సందర్భంగా రూ.299 నుంచి రూ.2999 ప్లాన్‌లపై చెల్లుబాటు అవుతాయి.

రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2 జీబీ మొబైల్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లను 28 రోజుల చెల్లుబాటుతో 7 జీబీ అదనపు డేటా యొక్క అదనపు ప్రయోజనంతో అందిస్తుంది.

రూ.749 ప్రీపెయిడ్ ప్లాన్ పైన పేర్కొన్న ప్రయోజనాలను 90 రోజుల చెల్లుబాటుతో పాటు 14 జీబీ అదనపు డేటాతో పాటు అందిస్తుంది.

రూ. 2,999 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2.5 జీబీ మొబైల్ డేటా, అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుంది.

 
 
bottom of page