ఘోర ప్రమాదం.. గూడ్స్ రైలు ఢీకొట్టిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్..50 మంది మృతి
- Tatipaka Premchand
- Jun 2, 2023
- 1 min read

పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నుంచి తమిళనాడులోని చెన్నైకి వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం జరిగింది. ఒడిశాలోని బాలాసోర్ నుంచి 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న బహనాగ్ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం 7 గంటల 20 నిమిషాలకు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 18 బోగీలున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 3 కోచ్‌లు మినహా అన్నీ పట్టాలు తప్పినట్లు ప్రాథమిక సమాచారం ఆధారంగా తెలుస్తోంది. ఈ బోగీల్లో భారీగా ప్రయాణికులు చిక్కుకున్నారు. 132 మంది గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.



Comments