top of page

ఐదేళ్లలో 28 శాతం పెరిగిన రాహుల్ గాంధీ ఆస్తులు..🗳️


రాహుల్ గాంధీ సమర్పించిన ఎన్నికల అఫిడ్‌విట్ ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ రూ.20.4 కోట్లు. ఐదేళ్లలో తన ఆస్తులు రూ.6 కోట్ల మేర పెరిగినట్టు పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో ఆస్తుల విలువ రూ.14 కోట్లుగా అఫిడ్‌విట్‌లో తెలిపారు. గతం కంటే 28 శాతం పెరిగింది. ఆయనపై 18 క్రిమినల్ కేసులున్నట్టు తెలిపారు. వీటిలో ‘మోదీ ఇంటిపేరు’ వ్యాఖ్యలపై గుజరాత్ కోర్టు దోషిగా నిర్దారించిన కేసు కూడా ఉంది. దీనిపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో రాహుల్ గాంధీ అనర్హత నుంచి తప్పించుకున్నారు. ఇక, మార్చి 15 నాటికి తన వద్ద రూ.55 వేల నగుదు, రెండు బ్యాంకు ఖాతాల్లో రూ.26,25,157 ఉన్నట్టు వెల్లడించారు.ఎంపీగా వేతనం, అద్దెలు, బ్యాంకు వడ్డీ, బాండ్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు నుంచి ఆదాయం వచ్చినట్టు తెలిపారు. ఈక్విటీలు, మ్యూచివల్ ఫండ్లు, సేవింగ్ ఖాతాలు, గోల్డ్ బాండ్లు విలువ రూ.9.24 కోట్లుగా పేర్కొన్నారు. వీటిలో ఈక్విటీ షేర్లు రూ.4.33 కోట్లు, మ్యూచివల్ ఫండ్లు రూ.3.81 కోట్లు. వాణిజ్య భవనాలు, వ్యవసాయ, వ్యవసాయేతర భూములు సహా స్థిరాస్థులు 11.15 కోట్లుగా వివరించారు.

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page