భారతదేశంలో చౌకగా ఐఫోన్..
- MediaFx
- Jul 27, 2024
- 1 min read
భారతీయ కస్టమర్ల కోసం 128 GB స్టోరేజ్‌తో ఐఫోన్ ప్రో మోడల్ ధర 3.7 శాతం తగ్గింపు తర్వాత రూ. 1,29,800. అదేవిధంగా 256 జీబీ స్టోరేజ్‌తో కూడిన ఎంట్రీ లెవల్ ఐఫోన్ ప్రో మ్యాక్స్ ధర రూ.1,59,900 నుంచి రూ.1,54,000కి తగ్గింది. దీనితో పాటు యాపిల్ భారతదేశంలో తయారైన ఐఫోన్ 13, 14, 15 సిరీస్ ఐఫోన్‌ల ధరలను తగ్గించింది. ఐఫోన్ SE మోడల్ ధర రూ. 2,300 తగ్గింది. ఎంట్రీ లెవల్ iPhone SE ధర ఇప్పుడు రూ.49900 నుండి రూ.47600కి తగ్గింది. మొబైల్ ఫోన్లు, ఛార్జర్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుండి 15 శాతానికి తగ్గించే బడ్జెట్ ప్రతిపాదన తర్వాత ఐఫోన్ మోడల్స్ ధరలలో ఈ మార్పు జరిగింది. మొట్టమొదటిసారిగా యాపిల్ ఐఫోన్ ప్రో, ప్రో మాక్స్ మోడల్‌లను భారతదేశంలో మాత్రమే తయారు చేయబోతోంది. ఇది రాబోయే 16 సిరీస్ ఐఫోన్‌తో ప్రారంభమవుతుంది. సమాచారం ప్రకారం, ఇది ఫాక్స్‌కాన్ సహకారంతో భారతదేశంలో ఐఫోన్ 16 సిరీస్ ప్రో, ప్రో మాక్స్ మోడల్‌లను అసెంబుల్ చేస్తుంది. చైనా వెలుపల ఉత్పత్తిని ప్రోత్సహించే ప్రణాళికలో భాగంగా కంపెనీ దీన్ని చేస్తుంది. నివేదికల ప్రకారం.. iPhone 16 సిరీస్‌ను సెప్టెంబర్‌లో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.