అక్కా.! మరీ ఇలా ఉన్నావేంటీ.. విడాకులకు మరేం రీజన్ దొరకలేదా..
- MediaFx
- Aug 2, 2024
- 1 min read
తన భర్త పదేపదే మంచంపై మురికి బట్టలు తెచ్చి వేస్తున్నాడని విసిగిపోయిన ఓ భార్య ఏకంగా విడాకుల వరకు వెళ్లింది. తన భర్తకు ఉన్న ఈ ఒక్క అలవాటును తట్టుకోలేకపోతున్నానని.. విడాకులు ఇవ్వాలని ఆ మహిళ స్వయంగా కోర్టు మెట్లెక్కింది. మరి ఇంతకీ ఆమె భర్త ఏం చేస్తున్నాడో తెలుసుకుందామా.. సదరు మహిళ భర్త ఓ చెఫ్. అతడు పని నుంచి ఇంటికి రాగానే.. మంచంపై ఫుడ్ స్టెయిన్స్, గ్రీజు మరకలు ఉన్న బట్టలు తెచ్చి విసిరేసేవాడట. ఇలా చేయడం వల్ల పదేపదే బెడ్‌షీట్స్ మార్చడమే ఆమెకు పనిగా మారిందట. అంతేకాకుండా అతడ్ని ఈ చెడ్డ అలవాటును వదిలేయమని ఎన్నిసార్లు చెప్పినా వినలేదట. దీంతో భర్త ప్రవర్తనకు విసిగిపోయిన భార్య చివరికి విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కాగా, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.