top of page

👥🍬🏛️ ఎన్నికల వరకు చక్కర తినొద్దు.. పార్టీ కార్యకర్తలకు బీజేపీ లీడర్‌ సూచన. ఎందుకంటే.. 😅💰📢

ఆయన తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ. వచ్చే ఎన్నికల్లో కాషాయ పార్టీ నుంచి పోటీ చేయడానికి కసరత్తు చేసుకుంటున్నారు. అయితే ఈ మధ్య పార్టీ మీటింగ్స్ లో హెల్త్ క్లాసులు చెప్తున్నారు. 🏥🗣️🏛️

షుగర్ మానేస్తే… అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. ఇంతకీ షుగర్ కి అధికారానికి సంబంధం ఎంటి ? షుగర్ మానేస్తే అధికారంలోకి వస్తామని చెప్పిన ఆ నాయకుడు గురించి హాట్ టాపిక్‌గా మారింది. 😲🎤🚀

చేవెళ్ల మాజీ ఎంపి. ఇటీవలే బీజేపీలో చేరిన ఈయన వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కార్యకర్తలతో తరుచూ సమావేశమవుతున్నారు. ఆ సమావేశాల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. కార్యకర్తలకు హెల్త్ క్లాసులు చెబుతున్నారు. 🤝💪👥

షుగర్ తీసుకుంటే మెదడు మొద్దు బారుతుందని… గెలవాలనే తపన ఉండదని కొండా తన పొలిటికల్ మీటింగ్స్ లో కార్యకర్తలకు ఆరోగ్య సూచనలు చేస్తున్నారు. దీనిపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కూడా చర్చ జరిగింది. సమావేశాల్లో చాయ్ కి బదులుగా వేడినీళ్లు ఇచ్చి కార్యకర్తలను ఉత్తేజ పరచాలని కమలనాథులు భావిస్తున్నారు. 🍵💪👥

మొత్తానికి ఎన్నికల్లో గెలుపు సంగతి ఏమో కానీ.. షుగర్ తగ్గిస్తే ఆరోగ్యానికి మాత్రం మేలు జరుగుతుందని మాత్రం అనుకుంటున్నారు. 🚫🏥💪

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page