top of page

🗳️ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ..

🔵 బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సీఈసీలో సభ్యులైన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఇతర సభ్యులందరూ పాల్గొంటారు.

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ, ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ అధ్యక్షుడు అరుణ్‌ సావో ఆ రాష్ట్రానికి చెందిన ఇతర కీలక నేతలు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. సీఈసీలో మొత్తం 15 మంది సభ్యులున్నారు. అందరూ నేటి సమావేశానికి హాజరుకానున్నారు. 🗳️ బలహీనంగా ఉన్న స్థానాలు గుర్తించడం, అక్కడ బలమైన అభ్యర్థులను నిలపడం వంటి కీలక అంశాలపై సీఈసీలో మేధోమధనం జరుగుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. అధిక దృష్టి పెట్టాల్సిన స్థానాలను ఇప్పటికే బీజేపీ నాయకత్వం గుర్తించినట్టు సమాచారం. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌కు సంబంధించిన కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలకు సంబంధించిన ప్రచార వ్యూహం, అభ్యర్థుల ఎంపిక అంతా ఈ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ కనుసన్నల్లోనే జరుగుతుంది.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page