top of page

లంచ‌గొండుల్ని వణికించేలా ‘భారతీయుడు 2’ ట్రైలర్..

లోక నాయకుడు కమల్ హాసన్ నట విశ్వరూపాన్ని కళ్లకి కడుతూ.. ‘భారతీయుడు 2’ ట్రైలర్ వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన యూనివర్సల్ ప్రాజెక్ట్ మూవీ ‘ఇండియన్ 2’ని తెలుగులో.. భారతీయుడు 2గా జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. రెండున్నర నిమిషాల నిడివితో రిలీజ్ అయిన ‘భారతీయుడు 2’ ట్రైలర్‌లో 28 ఏళ్ల నాటి భారతీయుడ్ని గుర్తు చేశాడు కమల్ హాసన్. ఇది రెండో స్వాతంత్ర్య పోరాటం అంటూ సేనాపతిగా విశ్వరూపం చూపించారు కమల్. అవినీతిని అంతం చేయడానికి ‘సేనాపతి’ చేస్తున్న యుద్ధం ఎలా ఉందో.. ఈ ట్రైలర్‌లో చూసేయండి.

వామ్మో.. లంచం తీసుకుంటే ఆ ముసలోడు వచ్చే చంపేస్తాడేమో అని లంచం పేరు చెప్తేనే భయపడేట్టు చేశాడు భారతీయుడు. ఇది సినిమానే కావచ్చు కానీ.. భారతీయుడు సినిమా ద్వారా లంచగొండుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు కమల్ హాసన్. దాదాపు 28 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. అదే ‘భారతీయుడు 2’. శంకర్ దర్శకత్వంలో చాలా ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా.. ఎట్టకేలకు విడుదలకు రెడీ అయ్యింది. జూలై 12న ‘భారతీయుడు 2’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండగా.. రిలీజ్ ట్రైలర్‌ను మంగళవారం నాడు విడుదల చేశారు. రెండున్నర నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్‌లో ఇది రెండో స్వాతంత్ర్య పోరాటం అంటూ సేనాపతిగా కమల్ హాసన్ నట విశ్వరూపం చూపించారు.

శంకర్ టేకింగ్‌కి తోడు.. కమల్ హాసన్ నట విశ్వరూపం భారతీయుడ్ని మళ్లీ గుర్తు చేసింది. అవినీతిని అంతమొందించడానికి వచ్చిన హంటింగ్ డాగ్‌గా ‘భారతీయుడు’లోని మరో కోణాన్ని చూపించాడు శంకర్. ఆయనే మళ్లీ రావాలి అంటూ హీరో సిద్దార్థ్ ‘భారతీయుడు’కి ఇచ్చి ఎలివేషన్స్ హైలైట్‌గా నిలిచాయి. గాంధీజీ మార్గంలో మీరూ.. నేతాజీ మార్గంలో నేనూ అంటూ కమల్ హాసన్.. అవినీతి పరుల్ని వేటాడే వేట నెక్స్ట్ లెవల్ అనేట్టుగా ఉంది. ముఖ్యంగా ఆయన గెటప్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనేట్టుగానే ఉన్నాయి.

అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్.. ట్రైలర్‌కి హైప్ తీసుకుని రాగా.. యాక్షన్ ఎపిసోడ్స్‌లో పాతికేళ్ల నాటి కమల్ హాసన్‌ని గుర్తు చేస్తున్నాడు ‘భారతీయుడు 2’. నా నుంచి పారిపోలేరు.. దాక్కోనూ లేరూ.. ఆట ఆరంభమైంది.. మ్యా అంటూ భయపెట్టేస్తున్నాడు భారతీయుడు. ప్రతినాయకుడిగా ఎస్ జే సూర్య తన విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్నాడు. సిద్ధార్థ్‌తో పాటు.. కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌‌లు ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించారు.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page