top of page

సౌందర్య చీర రంగుతో ఎడిటర్ మోసం..


ఆగస్ట్ 9 మురారి రీ రిలీజ్ సందర్భంగా అభిమానులకు అందుబాటులో ఉంటూ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ తనకు తెలిసిన విశేషాలను పంచుకుంటున్నారు. ఏదైనా సందేహం వెలిబుచ్చితే వీలైనంత త్వరగా తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఒక మూవీ లవర్ అంతఃపురం సినిమా ప్రస్తావన తీసుకొచ్చాడు.


అందులో అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు పాటలో సౌందర్య చీర రంగులు మారుతూ ఉండటం భలేగా అనిపించిందని, ఈ క్రియేటివ్ ఐడియా ఎలా వచ్చిందంటూ అడిగాడు. నిజానికి టీవీలో చూసిన చాలా మంది మనసులో ఉన్న ప్రశ్న ఇదే. దానికాయన షాకయ్యే సమాధానం ఇచ్చారు. అసలది తాను డిజైన్ చేసింది కాదని, జెమిని ఛానల్ ప్రసారంలో దాని ఎడిటర్ అలా కలర్స్ మారుస్తూ పోయాడు తప్పించి ఒరిజినల్ వెర్షన్ కేవలం ఎరుపు రంగు మాత్రమే ఉంటుందని తేల్చేశారు. దీంతో థియేటర్ లో మిస్ అయిపోయి కేవలం టీవీలో చూసిన వాళ్ళు ఒక్కసారిగా ఖంగు తిన్నారు.


అంటే ఇన్నాళ్లు క్రియేటివ్ డైరెక్టర్ తెలివి అనుకుంటున్న సౌందర్య చీర రహస్యం వెనుక టీవీ ఎడిటర్ ఉన్నాడన్న మాట. ఒకవేళ ఆయన చెప్పకపోయి ఉంటే రంగులు మారిన అబద్దం శాశ్వతంగా ఉండిపోయేది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కృష్ణవంశీ రూపొందించిన అంతఃపురం అప్పట్లో కమర్షియల్ గానూ గొప్ప విజయం సాధించింది. భర్త చనిపోయాక అతని జ్ఞాపకాల్లో ఉన్న సౌందర్య ప్రేమ, విషాదాన్ని కలగలిసి పాడుకునే పాటగా అసలేం గుర్తుకురాదు వస్తుంది. సీతారామశాస్త్రి సాహిత్యంతో ఇళయరాజా కంపోజింగ్ దాన్నో మర్చిపోలేని క్లాసిక్ సాంగ్ గా నిలిచిపోయేలా చేసింది.

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page