top of page

🚨🦠 బీ అలర్ట్..కరోనా మళ్లొచ్చింది.. కొత్త వేరియంట్‌తో ఐదుగురు మృతి..

📅 డిసెంబర్‌ 8న కేరళలో 78 ఏళ్ల మహిళలో ఈ వేరియంట్‌కి సంబంధించిన తేలికపాటి లక్షణాలను గుర్తించారు అధికారులు. ఓమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌గానే పరిగణించారు. తాజాగా.. కరోనాతో ఐదుగురు మరణించడం కలకలం రేపింది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.

📍 కేరళలో కొత్త వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేరళలో నలుగురు, యూపీలో ఒకరు మరణించారు. ఇండియా సహా 38 దేశాల్లో కొత్త వేరియంట్ JN.1 గుర్తించారు. దీంతో భారత ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ రాష్ట్రలకు సూచించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మార్గదర్శకాలతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. అప్రమత్తంగా ఉంటూ, కొత్త కేసులపై నిఘా ఉంచాలని అదేశించింది. RTPCR టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేయాలని.. వేరియంట్ తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్స్ టెస్టులు నిర్వహించాలని సూచించింది. వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచనలు చేసింది. 🌐


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page