top of page

🌟 బంగారు బాణం చేతబూని చిరునవ్వుతో బాల రాముడు.. ఫస్ట్ లుక్ రివీల్..

🕉️ అయోధ్య రామ మందిరంలోని మొదటి అంతస్థులో గర్భ గుడిలో బాల రాముడి విగ్రహము ఏర్పాటు చేశారు. ఈ రామ్ లల్లా విగ్రహం సోమవారం నాడు జరిగే పవిత్రోత్సవానికి రెండ్రోజుల ముందు అంటే ఈరోజు బహిర్గతమైంది.

51 అంగుళాల రామ్ లల్లా విగ్రహం నల్లరాతితో మలచబడింది. ఐదు ఏళ్ల ప్రాయంలో రామచంద్రుడు బంగారు విల్లు, బాణం పట్టుకుని నిలబడి ఉన్న భంగిమలో దర్శనం ఇస్తున్నాడు. ఈ విగ్రహాన్ని కర్ణాటక లోని మైసూర్‌కు చెందిన కళాకారుడు అరుణ్ యోగిరాజ్ చెక్కారు.

🚀 అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సంప్రోక్షణ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 22వ తేదీన ఆలయ అధికారులు గర్భ గుడిలో రామ్ లల్లాకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే గురువారం గర్భగుడి లోపల విగ్రహం ఉంచిన ఫొటోలు విడుదల కాగా.. ఆ విగ్రహం తలపై పసుపు గుడ్డ కప్పి ఉంచారు.

🌄 ఈ రోజు ఉదయం విగ్రహం కళ్ళు మాత్రమే కప్పబడిన మరో చిత్రం బయటపడింది. పూర్తి రూపాన్ని చివరకు మధ్యాహ్నం ఆవిష్కరించారు. ఈ విగ్రహం బాల రాముడి ముఖంతో పాటు బంగారు విల్లు, బాణాన్ని పట్టుకుని నిలబడి ఉన్నట్లు చూపిస్తోంది. 🌅

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page