top of page

దుబాయ్ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక


ఎడారి దేశం దుబాయ్‌లో ప్రస్తుతం అస్థిర వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎడారి నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడి వర్షాలకు జనం బెంబేలెత్తిపోతున్నారు. అప్పటికప్పుడే దట్టమైన మేఘాలు ఏర్పడి.. ఆకాశానికి చిల్లుపడినట్టు వర్షం కురిసి ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లు, మాల్స్, రహదారులు, వ్యాపార సంస్థలు నీటమునిగాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల రక్షణ కోసం దుబాయ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మే మొదటి వారంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన వాతావరణ శాఖ.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది.రెండు రోజుల పాటు ఉరుములు , మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని హెచ్చరించింది. ‘దయచేసి బీచ్‌లకు దూరంగా ఉండండి.. నౌకాయానం చేయొద్దు.. లోయ ప్రాంతాలు, కుండపోత వర్షాలు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లొద్దు.. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త ఉండాలి’ అని ఓ ప్రకటనలో తెలిపింది. అధికారుల సూచనలు, మార్గదర్శకాలను ప్రజలను పాటించాలని పేర్కొంది. ఇప్పటికే దుబాయ్ నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NCEMA) ఇప్పటికే రెస్క్యూ చర్యలు ప్రారంభించింది.

వాతావరణ శాఖ హెచ్చరికలతో పలు ప్రయివేట్ సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలలను కూడా మూసివేశారు. దుబాయ్‌లోని పోర్ట్స్, కస్టమ్స్ అండ్ ఫ్రీ జోన్ కార్పొరేషన్ (PCFC) కూడా నౌకల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది.

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లు రేపటి ప్రతికూల వాతావరణానికి సంబంధించి ప్రయాణీకులకు సలహాలను కూడా జారీ చేసింది. అధికారులు ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్రారంభించాలని మరియు వారు కారులో లేదా ప్రజా రవాణాలో ప్రయాణించినా సకాలంలో విమానాశ్రయానికి చేరుకోవడానికి కొంత అదనపు ప్రయాణ సమయాన్ని జోడించాలని కోరారు. విమాన ప్రయాణీకులకు కూడా దుబాయి ఎయిర్‌పోర్ట్ సూచనలు జారీ చేసింది. విమానాశ్రయానికి చేరుకోడానికి ముందే ప్రయాణం ప్రారంభించాలని సూచించింది.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page