top of page

వైద్యుల సంఘంతో ఏఆర్ రెహమాన్ కు వివాదం

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐసీవోఎన్) ఏఆర్ రెహమాన్ కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది. రూ.29 లక్షలు తీసుకున్న రెహమాన్ ఒప్పందానికి అనుగుణంగా సంగీత కార్యక్రమం నిర్వహించలేదని ఆరోపించింది. దీనిపై రెహమాన్ న్యాయవాది స్పందించారు. రెహమాన్ పై నమోదు చేసిన కేసును మూడు రోజుల్లోగా ఉపసంహరించుకోవాలని కోరారు. రూ.10 కోట్ల పరువు నష్టం చెల్లించాలని డిమాండ్ చేశారు. వైద్యుల సంఘం చేసిన ఆరోపణలను తోసిపుచ్చుతూ, ఇందులో మూడో పక్షం జోక్యం ఉన్నట్టు ఆరోపించారు. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వైద్యుల సంఘాన్ని న్యాయవాది కోరారు.

ree

 
 
bottom of page