top of page

ఫోన్ నెంబర్ ఇచ్చిన యాంకర్ రష్మీ 😊


యాంకర్ రష్మీ పెట్ లవర్ అన్న సంగతి తెలిసిందే. తాజాగా రష్మీ తన ఇన్ స్టా గ్రాం స్టోరీలో పెట్స్ గురించి ఆవేదన చెందింది. అసలే ఇప్పుడు వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి.. వరదలు వస్తున్నాయ్.. ఇలాంటి టైంలో జనాలను సురక్షిత ప్రాంతాలకు ప్రభుత్వాలు తరలిస్తుంటాయి.. కానీ జంతువుల గురించి అంతగా పట్టించుకోవు.ఇలాంటి సమయంలో పెట్స్, జంతువుల రక్షణ కష్టతరం గురించి చెప్పుకొచ్చింది. 😇🦁🐶🦌🐦

జంతువుల గురించి కూడా కాస్త ఆలోచించండని, అలా వదిలేయకండని, మీరు బయటకు వెళ్లే టైంలో వాటిని కట్టేసి ఉంచకండి.. ఒక వేళ వరదలు వస్తే.. వెళ్లేందుకు వాటికి దారి ఉండదు.. అందుకే వాటిని ఫ్రీగా వదిలేయండి.. మీకు ఎలాంటి సలహాలు, సాయం కావాలన్నా రెస్క్యూ టీం అందుబాటులో ఉంటుంది.. వారి నంబర్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను” అంటూ ఓ నంబర్‌ను చూపించింది రష్మీ. జంతువుల ప్రాణాలను కాపాడండి అంటూ రష్మీ వేడుకుంది. 😊🐾


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page