అల్లు అర్జున్ దుబాయ్ వెళ్ళింది అందుకేనా?🎥✨
- Suresh D
- Mar 26, 2024
- 1 min read
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే వైజాగ్, హైదరాబాద్‌లో పుష్ప 2 షూటింగ్ షెడ్యూల్‌ను ముగించారు. ప్రస్తుతం ఖాళీగానే ఉండటంతో నిన్న తన భార్య అల్లు స్నేహ రెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి దుబాయ్ వెళ్లారు అల్లు అర్జున్. అయితే ఇది వెకేషన్ కోసం వెళ్లిన టూర్ కాదట. మరి బన్నీ ఎందుకు వెళ్లారంటే?. దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ ఈవెంట్‍కి హాజరయ్యేందుకే బన్నీ ఫ్యామిలీతో పాటు దుబాయ్ వెళ్లారు. పుష్ప సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్‌లో పేరు తెచ్చుకున్న బన్నీ విగ్రహాన్ని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయడంపై ఆయన ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మార్చి 28న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తెలుగు హీరోలు ప్రభాస్, మహేష్ బాబు మైనపు విగ్రహాలు ఏర్పాటు చేశారు. కానీ ఇవి లండన్‌లోని మ్యూజియంలో ఉన్నాయి. అయితే అల్లు అర్జున్‌ది మాత్రం దుబాయ్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్న తొలి ఇండియన్ యాక్టర్ విగ్రహం అల్లు అర్జున్‌దే కావడం విశేషం.🎥✨



Comments