top of page

బన్నీ సరసన సంయుక్త..త్రివిక్రమ్ నుంచి కబురు.?

వరుసగా నాలుగు హిట్లు ఖాతాలో వేసుకున్న మలయాళ బ్యూటీ పుష్ప2 తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్న అల్లు అర్జున్ఇం దులో ఒక హీరోయిన్ గా సంయుక్తను ఎంచుకున్నట్టు ప్రచారం..

భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష.. ఇలా వరుసగా హిట్లు సొంతం చేసుకున్న హీరోయిన్ సంయుక్త మీనన్ ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ గా మారిపోయింది. అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంటున్న సంయుక్తకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. విరూపాక్ష సినిమాతో ఆమె నటనకు మంచి మార్కులు పడటంతో బలమైన కథలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. వరుసగా నాలుగు హిట్లు చేరి లక్కీ హీరోయిన్ అన్న ట్యాగ్ లైన్ తోడవడంతో స్టార్ హీరోలు, దర్శకులు ఆమె వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో సంయుక్తకు మరో భారీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ప్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చిందని టాలీవుడ్ సమాచారం. ‘పుష్ప 2’ బన్నీ .. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ హీరోయిన్లలో ఒకరిగా సంయుక్తకు త్రివిక్రమ్ నుంచి పిలుపు వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే సంయుక్తకు టాలీవుడ్ లో ఇక తిరుగుండదని అంటున్నారు.

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page