top of page

🇮🇳 భారత్‌లో పుట్టిన వాళ్లంతా తొలుత హిందువులే.. 🇮🇳

🏛️ మాజీ కాంగ్రెస్‌ పార్టీ నేత గులాం నబీ ఆజాద్‌ ఇస్లాం మతంపై చేసిన వ్యాఖ్యలపై రగడ రాజుకుంది. భారతదేశంలో హిందూమతమే ఇస్లాం కంటే అతి పురాతనమైనదన్నారు ఆజాద్‌.

ree

అంతేకాదు.. భారత్‌లో పుట్టిన వాళ్లంతా తొలుత హిందువులేనని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం భారతదేశానికి కొన్నేళ్ల కిందట మాత్రమే వచ్చిందని, కానీ హిందూమతం అత్యంత పురాతనమైందన్నారు. ఇక్కడ స్థిరపడ్డ ముస్లింలలో బయటిదేశాల నుంచి వచ్చిన వాళ్లు కొంతమందే ఉంటారని, మిగతా వాళ్లంతా ముస్లిం మతంలోకి మారిన హిందువులేని అన్నారు. ఇస్లాం మతల కేవలం 1,500 ఏళ్ల నుంచి మాత్రమే ఉందన్నారు ఆజాద్.

🏔️ జమ్ముకశ్మీర్‌‌లోని దోడా జిల్లా తాల్హ్రీ ప్రాంతంలో జరిగిన సభలో ఆజాద్‌ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కశ్మీరీ పండిట్‌ల గురించి మాట్లాడుతూ.. వాళ్లు కూడా పెద్ద ఎత్తున ఇస్లాం మతంలోనే మారిపోయారన్నారు. 600 సంవత్సరాల క్రితం కశ్మీర్‌లో ఒక్క ముస్లీం కూడా లేరని, కశ్మీర్‌ పండిట్స్‌లుగా చాలామంది ముస్లింలుగా మారిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీలంతా హిందూమతంలోనే జన్మించారన్నారు.


 
 
bottom of page