మూడో సీజన్‌తో మళ్ళీ మీ ముందుకు ‘ఆహా తెలుగు ఇండియన్ ఐడల్
- MediaFx

- Jun 7, 2024
- 1 min read
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు, ప్రేమికుల నుంచి ప్రశంసలు పొందిన సింగింగ్ రియాలిటీ షో ‘ఆహా తెలుగు ఇండియన్ ఐడల్’. ఇప్పటికే రెండు సీజన్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మూడో సీజన్‌కు సిద్ధమైంది. 37 దేశాల్లో 1500 పైగా ఆడిషన్స్ ను నిర్వహించి కంటెస్టెంట్లను సెలక్ట్ చేసింది. హోస్ట్‌గా శ్రీరామ చంద్ర ఉండగా సంగీత దిగ్గజాలైన ఎస్.ఎస్.తమన్, గీతామాధురి, కార్తీక్ లు న్యాయ నిర్ణేతల బృందంలో ఉన్నారు. మూడో సీజన్ జూన్ 14 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ లాంఛింగ్ ప్రొమోను విడుదల చేశారు. ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. సంగీత స్వర సాగరంలో మునిగిపోవటానికి ప్రేక్షకుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి సీజన్‌లో నెల్లూరుకు చెందిన వాగ్దేవి విజేతగా గెలవగా, రెండో సీజన్‌లో న్యూజెర్సీకి చెందిన శృతి నండూరి గెలిచింది. మరీ మూడో సీజన్‌లో ఎవరు విజేతగా నిలుస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.












































