🏏 3 బంతుల్లో 2 సిక్స్‌లు.. ఛాన్స్‌లిస్తే ఎవ్వరూ ఆపలేరు.! 🚀
- Shiva YT
- Aug 4, 2023
- 1 min read
🏏వన్డేల్లో తొలి మ్యాచ్ ఆడిన ఈ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ ఏమాత్రం జంకకుండా.. ఎదుర్కున్న రెండో బంతినే సిక్స్‌గా మలిచాడు. అలాగే ఆ తర్వాత బంతిని కూడా సిక్స్ కొట్టి.. మొదటి మూడు బంతుల్లోనే 2 సిక్స్‌ర్లు బాదేశాడు. మిడిలార్‌గా తిలక్ వర్మ బ్యాటింగ్ చూసిన నెటిజన్‌లు.. యువరాజ్, రైనాలను గుర్తు చేసుకున్నారు. టీమిండియాకు మరో రైనా దొరికేశాడని కామెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్‌గా 22 బంతులు ఎదుర్కున్న తిలక్ వర్మ 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39 పరుగులు చేశాడు. టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో అతడే టాప్ స్కోరర్. ప్రస్తుతం అతడి బ్యాటింగ్‌కి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 🏅🔥












































